Header Banner

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

  Sun May 11, 2025 10:52        Politics

శ్రీశైలం ప్రాజెక్టులో స్పిల్ వే వద్ద ఏర్పడిన ప్లంజ్ పూల్(పెద్ద గొయ్యి).. ఏప్రాన్ కన్నా దిగువకు విస్తరించింది. ప్రాజెక్టు స్పిల్ వేకు సమాంతరంగా కొద్ది దూరంలో పునాది కన్నా దిగువన గొయ్యి పడింది. కోతను నివారించేందుకు ఏర్పాటు చేసిన స్టీలు సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్తో కూడిన నిపుణుల బృందం ఇటీవల ప్రాజెక్టును సందర్శించి తక్షణం చేపట్టాల్సిన పనులపై సిఫారసులు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టులో భద్రతా పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకూ కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పనులు జగన్ సర్కారు హయాం నుంచి ఆలస్యమవుతూ ఉన్నాయి. 2022లో ఒకసారి, 2024లో ఒకసారి జాతీయ డ్యాం భద్రత అథారిటీ ఈ ప్రాజెక్టును సందర్శించి, పలు సిఫారసులు చేసింది. వాటి ఆధారంగా చేపట్టాల్సిన పనుల్లో అడుగు ముందుకు పడటంలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు పరిస్థితిపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీకి ఫిర్యాదు చేయడం, అథారిటీ చైర్మన న్ను రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ కోరడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం చంద్రబాబు వద్ద త్వరలో జలవనరుల శాఖ అంశాలపై సమావేశం ఉంది. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు భద్రతా పనులపైనా చర్చించనున్నారు. శ్రీశైలంలో ఏప్రాన్ 169 మీటర్ల వద్ద ఉంటే ప్లంజ్ పూల్ 122 మీటర్ల వరకు ఉంది. అంటే ఏప్రాన్ కన్నా లోతుకు దాని సమాంతరంగా ఈ గొయ్యి ఉంది. అది విస్తరిస్తూ ఉంది.

 

ఇది కూడా చదవండి: వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత లోతైన ఫౌండేషన్(పునాది) తొమ్మిదో బ్లాకులో 134 మీటర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ప్లంజ్ పూల్ దాని కన్నా 12 మీటర్ల లోతులో ఉందని గుర్తించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేదని డ్యాం భద్రతా నిపుణులు పేర్కొన్నా ప్లంజ్ పూల్ విస్తరించకుండా చర్యలు అవసరమని చెబుతున్నారు. స్పిల్ వే మీదుగా ఉధృతంగా వచ్చి పడే నీటి ప్రవాహం వల్ల తీవ్ర కోత ఏర్పడుతోంది. క్రమంగా గొయ్యి పెరుగుతోంది. 1984లో ప్రారంభ దశలోనే ఈ సమస్యను గుర్తించారు. స్పిల్ వే ఫౌండేషన్(పునాది)కు, ఏప్రాన్కు నష్టం జరగకుండా చూడాలని భావించారు. ఏప్రాన్ పక్కనే స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 1.98 వ్యాసం, 18 మీటర్ల ఎత్తుతో 62 సిలిండర్లలో కాంక్రీటు నింపి 1985-87 మధ్య ఏర్పాటు చేశారు. ఆ సిలిండర్లలో 20 ధ్వంసమైనా వాటిని మార్చలేదు. ధ్వంసమైన సిలిండర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తే కొంత వరకు ప్లంజ్ పూల్... స్పిల్ వే ఫౌండేషన్ దాకా విస్తరించకుండా ఉంటుందని తాజాగా నిపుణులు పేర్కొన్నారు. 12 సిలిండర్లు పూర్తిగా, మరో 8 సిలిండర్లు పాక్షికంగా శిథిలమయ్యాయి. ఏప్రాన్లోకి రహదారి నిర్మించాల్సి ఉంది. స్పిల్ వే దిగువన ఎడమ, కుడి కొండ గట్లు జారిపోతున్నాయి. ఈ కొండల వాలుకు క్రీటింగు చేయాల్సి ఉంది. డ్రిప్ కింద రూ.200 కోట్ల అంచనాతో తొలి విడత పనులు చేపట్టేందుకు ప్రతిపాదించినా ముందడుగు పడటం లేదు. డ్రిప్ పథకాన్ని వినియోగించుకోవాలా, లేదా అన్న విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఎటూ తేల్చడం లేదు. 2024లో రూ.14.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి... రూ.2 కోట్లే విడుదల చేశారు. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నాయి. కీలక పనులకు నిధులు అవసరం.

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations